క్షేత్ర స్థాయిలో విద్యుత్ సిబ్బంది చిత్త శుద్దితో పనిచేసి ప్రభుత్వం విద్యుత్ శాఖ ద్వారా ప్రజలకు అందిస్తున్న సబ్సిడీ పథకాలను వివరించాలని విద్యుత్ ఏఈ రామకృష్ణ కోరారు. తాళ్లూరు మండల ఏఈగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత గురువారం విద్యుత్ నబ్ స్టేషన్లో విద్యుత్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఏ. ఈ మాట్లాడుతూ అర్హలైన ప్రతి ఒక్కరూ నూర్య ఘర్ పథకాన్ని వినియోగించుకునేలా ప్రొత్సహించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కోటి మందికి మాత్రమే ఈ పథకాన్ని ఇస్తున్నందుకు త్వరగా పథకంలోనికి వచ్చి విద్యుత్ ఉత్పత్తికి సహకరించేలా చూడాలని కోరారు. పథకం వలన వినియోగదారునికి, ప్రకృతి పర్యావరణానికి కలిగే ప్రయోజనాలను వివరించారు. నబ్సిడీతో వాలంటీర్ లోడ్ క్రమబద్ధీకరణలో వినియోగదారులకు అందిస్తున్న నబ్సిడీ గురించి తెలిపి ఓవర్ లోడ్ ఉన్న ప్రతి ఒక్కరూ నమోదు అయ్యేలా చూడాలని, ఈ నెలాఖరు వరకు మాత్రమే అవకాశం ఉందని చెప్పారు. విద్యుత్ బకాయిలు వసూళ్లు వేగవంతం చెయ్యాలని మండలంలో వ్యవసాయ విద్యుత్ బకాయిలు రూ. 65 లక్షల వరకు ఉన్నట్లు చెప్పారు. లైన్స్‌లో జంగిల్ క్లియరెన్స్ ఎప్పటికప్పుడు క్లియర్‌గా ఉండేలా చూసుకోవాలని కోరారు. ఓవర్ లోడ్ ట్రాన్స్ఫార్మర్లపై దృష్టి పెట్టి సమస్య పరిష్కరించాలని కోరారు. లైన్ ఇన్స్ఫెక్టర్లు ఆళ్ల శ్రీనివాస రావు, వివిఎన్ కాంతారావు తదితరులు పాల్గొన్నారు.

