గత సంవత్సర కాలంలో అభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని టిడిపి దర్శినియోజక వర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. తాళ్లూరు మండలంలో నిర్మాణంలో ఉన్న మొగలి గుండాల ప్రాజెక్టు, 132/33 కెవి సబ్ స్టేషన్ల ను డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ లలిత్ సాగర్ లు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి మాట్లాడుతూ వైసీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురైన మొగలి గుండాల ప్రాజెక్టు అందుకు నిదర్శనంగా నిలిచిందన్నారు. రూ. 10 కోట్లతో మంజూరు అయిన ప్రాజెక్టుకు మరో రూ.2 కోట్లు అవసరమైన మేర మంజూరు చేయించి త్వరలో పూర్తి చేసి తాళ్లూరుతో పాటు, చీమకుర్తి, సంతనూతలపాడు మండల ప్రజలకు నీటి సమస్యతీర్చటానికి తగిన చర్యలను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. అందుకు సంబంధించిన సాంకేతి సమస్యలను తొలగించి సత్వరమే పనులు పూర్తి చెయ్యాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కట్టల. నిర్మాణ పనులను, కాంక్రీటు పనులను పరిశీలించారు. మొగలి గుండాల చెరువు పై బాగన నిర్మాణంలో ఉన్న 132/33 సబ్ స్టేషన్ నిర్మాణ పనులను పరిశీలించారు. రూ.22.65 కోట్ల నిథులతో చేపట్టిన పనులు పూర్తి అయితే తాళ్లూరు, అద్దంకి ప్రాంతాల ప్రజలకు విద్యుత్ సరఫరా సక్రమంగా సాగుతుందని చెప్పారు. తాళ్లూరు మండల రైతులకు విద్యుత్ సరఫరా సక్రమంగా చేసేందుకు తురకపాలెం, లక్కవరం గ్రామాలకు అవసరమైన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ రూ. 1.40 కోట్లకు మంజూరు చేసినట్లు తెలిపారు. కురిచేడు మండలం కల్లూరులో రూ. 4 కోట్లతో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టనునన్నట్లు చెప్పారు. పలు అభివృద్ధి కార్యక్రమాలతో మందుకు వెళ్తున్నట్లు చెప్పారు. సీఎం చంద్ర బాబు నాయుడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి, మంత్రులు బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి కుమార్ ల సహకారంతో దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నట్లు తెలిపారు.
గత ఐదేళ్లలో కుంటు పడిన అభివృద్ధిని మరలా నేడు జరుగుతుండటం చూసి ప్రజలు హర్షిస్తున్నారని అన్నారు. ఇదే సూర్తితో దర్శిలో మిగిలిన పనులకు కూడ పూర్తి చేసి దర్శి రూపు రేఖలు మార్చటమే లక్ష్యమని చెప్పారు. నిరుద్యోగ సమస్యను తొలగించేందుకు దొనకొండ పారిశ్రామిక కారిడార్‌ను, దర్శిలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్, దర్శి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దటం, పల్లెలలో వెలుగులు నింపటం, మౌళిక వసతుల కల్పనే ధ్యేయంగా పెద్దల సహకారంతో కృషి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, ఇరిగేషన్ ఎఈ సుబ్బా రావు. విద్యుత్ ఈఈ శ్రీనివాస రావు, డిఈ క్రిష్ణా రెడ్డి, ఎడీ రవి కుమార్ . ఎఈ రామక్రిష్ణ, నాయకులు జి లక్ష్మి నారాయణ, హనుమంత రావు, వేణుబాబు, కాలేషా వలి, శాగం కొండా రెడ్డి, వెంకట రావు, కళ్యాణ్, పిన్నిక రమేష్ బాబు, రామయ్య, తిరుపతి స్వామి తదితరులు పాల్గొన్నారు. ముందుగా మాజీ ఎంపీటీసీ లక్షణ నారాయణ తండ్రిని పరామర్శించారు. స్థానిక అగస్తేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.






