కంటి ఆపరేషన్లకు శంకర వైద్యశాలకు తరలింపు

కంటి శుక్లాల పరీక్షలు నిర్వహించి కంటి శుక్లాల ఆపరేషన్ అవసరమైన వారిని తాళ్లూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నుండి సోమవారం పెద కాకాని శంకర కంటి వైద్యశాలకు తరలించారు. తాళ్లూరు పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ శంకర కంటి వైద్యశాల వాహనానికి జెండా ఊపి ప్రారంభించారు. తాళ్లూరు నుండి 60 మంది, ముండ్లమూరు మండలం నుండి 103 మంది శుక్లాల పరీక్షలకు తరలించినట్లు పీఎండీఓ ఉమా తెలిపారు. సీహెచ్ఐ రమణమ్మ, హెచ్ ఎన్ పీవీ రవి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *