తాళ్లూరు మండలంలోని బొద్దికూరపాడు శ్రీ కొడంద రామాలయానికి దూప దీప నైవేద్యం పథకం మంజూరు చేస్తూ దేవదాయశాఖ రాష్ట్ర కమీషనర్ కె రామ చంద్ర మోహన్ ఉత్తర్వులు జారీ చేసారు. ఈ పథకంలో ఆలయ పూజారికి రూ. 7 వేలు, ఇతర పూజా సామగ్రికి రూ. 3వేల చొప్పున మంజూరు అవుతుంది. ఆలయ పరిస్థితిపై పలువురు గ్రామ పెద్దల విజ్ఞప్తి మేరకు ఈ పథకంలో మంజూరు చేసినందుకు దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి, ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డికి, టిడిపి దర్శి ఇన్చార్జి డాక్టర్ గొట్టి పాటి లక్ష్మి, డాక్టర్ లిలిత్ సాగర్ లకు, రిటైర్డ్ హెచ్ఎం అంజి రెడ్డి కి పలువురు గ్రామ పెద్దలు, ఇతర నాయకులు ఆయయ భక్తు బృందం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
తాళ్లూరు మండలంలోని బొద్దికూరపాడు శ్రీ కోదండ రామాలయానికి దూపదీప నైవేద్యాలు మంజూరు
01
Jul