ప్రజా ఫిర్యాదుల పట్ల ప్రత్యేక చొరవ తీసుకోని పరిష్కారించాలి -ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ – ప్రజా ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం – జిల్లా ఎస్పీ -పోలీస్”ప్రజా సమస్యల పరిష్కార వేదిక”(మీకోసం) కార్యక్రమంకు 83 ఫిర్యాదులు

ప్రజల నుండి వచ్చే పలు రకాల ఫిర్యాదులను పరిష్కరించేందుకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్
ప్రజా సమస్యల పరిష్కార వేదిక”(మీకోసం) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదిదారులు స్వేచ్ఛాయుత వాతావరణంలో వారి సమస్యలను ధైర్యంగా ఎస్పీ కి విన్నవించుకున్నారు. జిల్లా ఎస్పీ ఫిర్యాదుదారుల అర్జీలను స్వీకరించి, వారితో ముఖాముఖీ మాట్లాడి వారి సమస్యల పూర్వాపరాలను అడిగి తెలుసుకుని, వాటిని చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో వచ్చిన ఆయా ఫిర్యాదులపై జిల్లా ఎస్పీ సంబందిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి వెంటనే చట్ట ప్రకారం విచారణ జరిపి ఫిర్యాదుదారులకు త్వరితగతిన న్యాయం అందించేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ కలహాలు, భర్త/అత్తారింటి వేధింపులు,జాబ్ మోసాలు, భూ వివాదాలు మరియు ఇతర సమస్యల గురించి ప్రజలు వినతులను ఇచ్చినారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని….

బంగారపు నెక్లెస్ తయారు చేయిస్తానని నమ్మించి, తన వద్ద నుండి సంతనూతలపాడు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పలు దఫాలుగా రూ.1,77,000/- అడ్వాన్స్ గా తీసుకొని బంగారపు ఆభరణం మరియు డబ్బులు ఇవ్వకుండా మోసం చేశాడని సంతనూతలపాడు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఫిర్యాదు.

గవర్నమెంట్ లోన్ ఇప్పిస్తానని చెప్పి ఒంగోలు, మామిడి పాలానికి చెందిన ఒక వ్యక్తి రూ.3,00,000/- డబ్బులు తీసుకొని లోను ఇప్పించకపోగా తీసుకున్న డబ్బులు అడుగుతుంటే ఇవ్వటం లేదని మామిడి పాలానికి చెందిన ఒక వ్యక్తి ఫిర్యాదు.

ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ సెల్ ఇన్స్పెక్టర్ దుర్గ ప్రసాద్, డీటీసి ఇన్స్పెక్టర్ షమీముల్లా, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పాండు రంగారావు, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్ రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *