శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణే లక్ష్యంగా కార్డన్ & సెర్చ్ నిర్వహించిన ప్రకాశం పోలీసులు -సరైన పత్రాలు లేని 29 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ ఆదేశాల మేరకు దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో త్రిపురాంతకం సర్కిల్ పోలీస్ అధికారులు మరియు సిబ్బంది కలిసి సోమవారం ఉదయం కురిచేడు పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిజ్ఞపూరి కాలనీలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ కార్డన్ & సెర్చ్ లో పోలీస్ లు ఆయా ప్రాంతాలోని అనుమానిత వ్యక్తులు/పాత నేరస్తుల ఇళ్లల్లో, గ్రామా శివారులు, ముఖ్యమైన కూడళ్లు, పలు షాప్ లలో డ్రోన్ కెమెరాలతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో సరైన పత్రాలు లేని 29 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నేర నియంత్రణ, అసాంఘిక కార్యక్రమాల అడ్డుకట్టకి పోలీసు శాఖ నిర్వహించే కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ కి ప్రజలు వంతు సహకారాన్ని అందించాలని పోలీసు అధికారులు కోరారు. వారి ప్రాంతంలో చట్ట వ్యతిరేక చర్యలు, అసాంఘిక కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే వెంటనే స్ధానిక పోలీసులకు లేదా డయల్ 112/100 కు తెలియజేయాలని కోరారు.

ఈ కార్డన్ & సెర్చ్ లో త్రిపురాంతకం సీఐ అస్సన్, కురిచేడు ఎస్సై ఎం శివ, దొనకొండ ఎస్సై త్యాగరాజు, త్రిపురాంతకం ఎస్సై శివ బసవరాజు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *