వైసీపీ నేత వల్లభనేని వంశీ విజయవాడ జిల్లా జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యారు. అన్ని కేసుల్లోనూ ఆయనకు బెయిల్ మంజూరు కావడంతో 140 రోజుల జైలు జీవితం అనంతరం బయటికి వచ్చారు. ఫిబ్రవరి 13న హైదరాబాదులో అరెస్టు అయిన వంశీ పై పలు సందర్భాల్లో పదకొండు కేసులు నమోదు అయ్యాయి.
