వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసం, ఆర్థిక లోటును పూడ్చుకుంటూ సంపద సృష్టితో అభివృద్ధి, సంక్షేమం -ఏడాదిలోనే ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున సిమెంటు రోడ్ల నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలు -పింఛన్లు పెంచాం, ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తున్నాం -ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు త్వరలో అన్నధాత సుఖీభవ -మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి – ప్రకాశం జిల్లా కొండపి మండలం గోగినేనివారిపాలెంలో కార్యకర్తల కోలహాల నడుమ పండుగ వాతావరణంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ప్రారంభించిన మంత్రి డా.స్వామి

గత ఐదు ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో జరిగిన విధ్వంసం, ఆర్థిక లోటును పూడ్చుకుంటూ సంపద సృష్టితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా పాలన సాగిస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. బుధవారం ప్రకాశం జిల్లా కొండపి మండలం గోగినేనివారిపాలెంలో
కార్యకర్తల కోలాహంతో పండుగ వాతావరణంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని మంత్రి డా. స్వామి ప్రారంభించారు. ముందుగా గ్రామంలోని నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి అనంతరం ఎస్సి కాలనీలో ఇంటింటికి
వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకుని యాప్ లో నమోదు చేశారు. ప్రజలకు కరపత్రాలు పంచుతూ ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా మంత్రి డా. డోలా బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ…..గత ఐదు ఏళ్లలో జరిగిన విధ్వంసం, ఆర్థిక లోటును పూడ్చుకుంటూ సంపద సృష్టితో అభివృద్ధి, సంక్షేమం చేస్తున్నాం. ఏడాదిలోనే ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున సిమెంటు రోడ్ల నిర్మాణం, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈ ఒక్క గ్రామంలోనే రూ. 55 లక్షలతో సిమెంట్ రోడ్లు నిర్మాణం చేసాం అని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్ రూ. 4 వేలకు పెంచాం అని, ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఒక్కొక్కరికి రూ.13 వేలు తల్లి వందనం ఇస్తున్నాం అని చెప్పారు. మహిళలకు ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని అన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. రైతులకు త్వరలో అన్నధాత సుఖీభవ ద్వారా ప్రతి రైతుకు రూ. 20 వేలు అందజేస్తామని, ఇంటి నిర్మాణం కోసం ఎస్సి, బీసీలకు రూ.3 లక్షలు కూటమి ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతున్నామని అన్నారు. ఓ వైపు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తూ, మరోవైపు రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిక్షణం ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్దే ద్వేయంగా పనిచేస్తూ ముందుకు సాగుతోందని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో రానున్న రోజుల్లో రాష్ట్ర ముఖ చిత్రం
మారనుందని మంత్రి డా.డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *