రైతాంగం నూతన వంగడాలను విత్తి అధికదిగుబడులు పొందాలని మండల వ్యవసాయాధికారి బి.ప్రసాదరావు తెలిపారు.
వెలుగువారిపాలెంలో పొలంపిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగాఏవో మాట్లాడుతూ ….శాస్త్ర వేత్తల పరిశోధనా ఫలితాలు క్షేత్రస్థా యిలో అనుకూలమయ్యేలా చూడటానికి చిరు సంచులను పరిశోధనా స్థానాలనుం డి రైతులకు అందజేయాలన్నారు. ఈ విత్తనాలు విత్తేందుకు నేల, నీరు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా వున్నాయో లేదో పరిశీలించటం జరుగుతుందన్నారు. వరిలో ఆర్ జియల్ 7034, 7038, 7039 రకాలను చిరు సంచులుగా రైతులచేత నాటించాలన్నారు. విత్తనోత్పత్తి చేసిన తరువాత పురుగులు, తెగుళ్లను ఏవిధంగా తట్టుకుంటుందో పంట కాలం అంతా పరిశీలించటం జరుగుతుందన్నారు.ఆవిధంగా విత్తనోత్పత్తి చేసివిత్త నాలను రైతులకు అందజేయటం జరిగిందన్నారు.ఈ కార్యక్రమ
విత్తనోత్పత్తి చేసివిత్తనాలను రైతులకు అందజేయటం జరిగిందన్నారు. విఏఏలు సుష్మ, సుల్తాన్, అజ్మీర్, కృష్ణారెడ్డి, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
