హైదరాబాద్, జూలై 2,(జే ఎస్ డి ఎం న్యూస్ ) :
కజకిస్తాన్, తెలంగాణ మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు మరింత బలపడే దిశగా ఓ కీలక అడుగు పడింది. ఉప ముఖ్యమంత్రి అధికార నివాసంలో భట్టి విక్రమార్క మల్లు, కజకిస్తాన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గౌరవ కాన్సుల్ డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్ సమావేశమయ్యారు.
ఈ భేటీలో కజకిస్తాన్, తెలంగాణ మధ్య వ్యాపార సహకారం, పెట్టుబడుల అవకాశాలు, ఇతర అనేక అంశాలపై చర్చ జరిగింది. త్వరలో హైదరాబాద్ – కజకిస్తాన్ మధ్య నేరుగా విమాన సర్వీసులపై కూడా ప్రకటన ఉండొచ్చన్న సంకేతాలు వెలువడ్డాయి.
ఈ ఉన్నతస్థాయి సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం, ఆరోగ్య సేవలు, విద్య, రవాణా కనెక్టివిటీ విస్తరణపై ప్రధానంగా చర్చించారు. ఇటీవల కజకిస్తాన్‌లో ఔషధ తయారీ కేంద్రాన్ని స్థాపించేందుకు హైదరాబాద్‌కు చెందిన ఎంఎస్ఎన్ లాబొరేటరీస్, కజక్ ఇన్వెస్ట్ మధ్య జరిగిన ఒప్పందంగురించివివరించారు. ఇది భారత – కజకిస్తాన్ మధ్య ఓకీలకమైలురాయిగాచెప్పవచ్చు. హైదరాబాద్ – అల్మాటీ (కజకిస్తాన్) నడుమ నేరుగా విమాన సేవలుప్రారంభించాలన్న ప్రతిపాదనపై చర్చ జరిగింది. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్‌లైన్ మార్కెటింగ్ & రూట్ డెవలప్మెంట్ హెడ్ ఆనంద ఆచార్యతో జరిగిన సమావేశం తెలిపారు. త్వరలో ఈ విమాన సర్వీసు ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఇది పర్యాటకం, వాణిజ్యం, సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించనుంది. అపోలో హాస్పిటల్స్ గ్రూప్ సీఎండీ డాక్టర్ శ్రీనివాస్ రావుతో కజకిస్తాన్‌లో ఒక వైద్య విద్యా సంస్థ, ప్రపంచ స్థాయి హాస్పిటల్ ఏర్పాటు చేయాలన్న అంశంపై చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు.
కజకిస్తాన్ కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వ నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. డాక్టర్ ఖాన్ ఇచ్చిన కజకిస్తాన్ సందర్శన ఆహ్వానాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క కుటుంబం, డాక్టర్ ఖాన్ కుటుంబ సభ్యులకు ప్రత్యేక విందు ఇచ్చారు. ఇది తెలంగాణ – కజకిస్తాన్ మధ్య ఉన్న స్నేహభావాన్ని, గౌరవాన్ని ప్రతిబింబించింది. పరస్పర మైత్రికి చిహ్నంగా నిలిచింది.

