బేగంపేట జూలై 7(జే ఎస్ డి ఎం న్యూస్) :
బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుళ్లు ను కారు తో డీ కొట్టడం తో ఒక కానిస్టేబుల్ కు కాలు విరిగింది.మరొకరికి స్వల్పగాయాలయ్యాయి.వారికి మెరుగైన చికిత్స కోసం కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.వారిలో కానిస్టేబుల్ ప్రవీణ్ కు సోమవారం సర్జరీ చేశారు.విషయం తెలుసుకున్న ఉత్తర మండలం డి సి పి సాధన రష్మీ పెరుమాళ్ కిమ్స్ ఆస్పత్రి కి చేరుకుని కానిస్టేబుల్ ను పరామర్శించారు.వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.అండగా ఉంటామంటూ చెప్పారు.ఈ సందర్భంగా డి సి పి రష్మి పెరుమాళ్ మాట్లాడుతూ
విధి నిర్వహణలో పోలీస్ లు అప్రమత్తంగాఉండాలన్నారు.ముఖ్యంగా బ్లూ కోల్ట్స్,రక్షక్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలన్నారు.అత్యవసర పరిస్థితుల్లో ముఖ్యమైన సమాచారం వుంటే వెంటనే ఉన్నతాధికారులకు తెలియ జేయాలన్నారు. డి సి పి వెంట బేగంపేట ఏ సి పి గోపాల కృష్ణమూర్తి ఉన్నారు.

