ముళ్ళమూరు చెందిన టిడిపి యువ నాయకుడు బేతపూడి రామారావు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బాబును మంగళగిరిలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. దీంతో సానుకూలంగా స్పందించిన మంత్రు లోకేష్ గ్రామ అభివృద్ధి కోసం అవసరమైన నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. యువత తెలుగుదేశం పార్టీకి చేదోడు వాదోడుగా నిలిచి పార్టీ అభివృద్ధి బలోపేదమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసి వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు. కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తకు టిడిపిలో మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. అదే ఉద్దేశంతో ముందుకు సాగాలన్నారు.
