విద్యార్థుల భవిష్యత్ పై తల్లిదండ్రులు సరియైన నిర్ణయం తీసుకోవాలి – గురుకుల పాఠశాల లజిల్లా కో-ఆర్డినేటర్ జయ

విద్యార్థుల భవిష్యత్ పై తల్లిదండ్రులు సరియైన నిర్ణయం తీసుకోవాలని
గురుకుల పాఠశాల లజిల్లా కో-ఆర్డినేటర్ జయ అన్నారు.
దర్శి లోని ఎన్నెస్పీ కాలని లోని డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ సాంఘీక సంక్షేమ బాలుర గురుకులం లో “మెగా పేరెంట్స్ డే”ను ఘనంగా నిర్వహించారు.
ఇంచార్జ్ ప్రిన్సిపాల్ మీరా సాహెబ్ అధ్యక్షత సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిధులుగా గురుకుల పాఠశాలల జిల్లా కో-ఆర్డినేటర్ జయ, దర్శి తహశీల్దారు శ్రావణ్ కుమార్, జిల్లా (ఐఆర్సీయస్)ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎగ్జికూటివ్ మెంబర్, మానవత స్వచ్ఛంద సేవాసంస్థ కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రసంగించారు. డీసీసీ జయ మాట్లడుతూ…. విద్యార్థుల భవిష్యత్ అద్యాపకుల మీదే కాకుండా,తల్లిదండ్రులు కూడా గురుతరమైన బాధ్యతను కలిగి వుండాలన్నారు.తహశీల్దార్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ…విద్యార్థులకు ప్రభుత్వం అన్నీ ప్రోత్సాహకాలిచ్చి, మెరుగైన భోజన సదుపాయాల కోసం సన్నబియ్యాన్నిచ్చి అన్నివిధాల ఆదుకుంటుందని తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ ఎగ్జికూటివ్ మెంబర్ కపురం శ్రీనివాసరెడ్డి మాట్లడుతూ…విద్యార్థుల ఎదుగుదలకు గురువుల పాత్ర తో పాటు తలిదండ్రుల పాత్ర కూడా ఎక్కువగా వుండాలని అన్నారు. గురువులు ఎంతటి ప్రావీణ్యులైనప్పటికీ, తలిదండ్రుల పెంపకం సరిగా లేకపోతే పిల్లలు చదువులోనేగాదు, నిజ జీవితంలో కూడా రాణించలేరని చెప్పారు. విద్యార్థులను గురువులు మందలిస్తేనే కొందరు తల్లిదండ్రులు ఓర్చుకొనే పరిస్థితుల్లోలేరని, ఈ పద్ధతిలో పూర్తిగా మార్పువస్తేనే విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని…ఎలాంటి చెడు అలవాట్లకు లోనుగాకుండా పిల్లలపట్ల తలిదండ్రులుఅత్యంత జాగరూకతతో వ్యవహరించాలని తెలిపారు. గత విద్యా సంవత్సరంలో ప్రధమ, ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన పదోతరగతి మరియూ ఇంటర్మీడియట్ విద్యార్థులకు “స్టడీ చైర్స్”, మరియు బహుమతులను కపురం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో చింతా తిరుపతిరెడ్డి సహకారంతో అందజేసారు. తల్లిదండ్రులకు ఆటలపోటీలు నిర్వహించి బహుమతులు అందించారు.ఈ కార్యక్రమంలో పి.ఎం. సీ చైర్మన్ ఏసు రత్నం, స్థానికులు తెల్లయ్య, ఎలీషా, సుశీలమ్మ, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *