ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని తూర్పువెంకటాపురం మోడల్ ప్రైమరీ పాఠశాల సమీపంలో విద్యుత్ స్తంభానికి ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్, ఫీజు క్యారియర్ తక్కువ ఎత్తులో ఉండటంతో విద్యార్థులకు ప్రమాదం పొంచి ఉందని జర్నలిస్ట్ డిజిటల్ మీడియా (జెఎస్ డీఎం ) లో శుక్రవారం ప్రచురితమైనది. తక్షణమే స్పందించిన విద్యుత్ ఉన్నతాధికారులు సిబ్బందిని తగిన ఆదేశాలు జారీ చేసారు. ఉదయం పాఠశాల తెరిచే లోపు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, ఫీజు క్యారియర్ ఎత్తుగా ఉంచి మరమ్మత్తులు చేసారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. తమ బాధలు క్షేత్ర స్థాయి విద్యుత్ అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని, ఉన్నతాధికారులకు తెలియటంతో తక్షణం స్పందించారని అందుకు కృషి చేసిన అధికారులకు జర్నలిస్ట్ డిజిటల్ మీడియా కు వారు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు.

