ఉపాధ్యాయులు విద్యార్థుల అభ్యసనా స్థాయిని దృష్టిలో ఉంచుకుని బోధన చెయ్యాలనిమండల విద్యాశాఖాధికారి గురజాల సుబ్బయ్య కోరారు. మండలంలోని బొద్దికూరపాడు, తాళ్లూరు, తూర్పుగంగవరం ఉన్నత పాఠశాలల్లో శనివారం నిర్వహించిన క్లస్టర్ స్థాయి సమావేశాలకు ఆయన హాజరు అయ్యారు. విద్యార్థులు ఆ పాఠశాలలో నమోదు ఎంత శాతం ఉన్నది, ఉపాధ్యాయుల డైరీ, పరీక్షల మూల్యాంకన పుస్తకం గురించి, విద్యార్థుల ప్రగతి పత్రం గురించి చర్చించారు. క్లస్టర్ చైర్మన్ పి సుబ్బారావు, సీఆర్పీలు పాల్గొన్నారు.

