ప్రజలకు నాణ్యమైన విద్యుత్, రైతులకు 9 గంటల విద్యుత్ అందించడంతో పాటు విద్యుత్ సమస్యల పరిష్కారమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్న దని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్
పేర్కొన్నారు.
ఒంగోలు నగర పరిధిలోని వెంకటేశ్వరకాలనీ నందు 4.50 కోట్లతో నిర్మించిన సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం కార్యక్రమం, ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్డు జంక్షన్ నందు 11 కోట్లతో నిర్మించునున్న వివిధ విద్యుత్ పనులకు భూమిపూజ మరియు ఒంగోలు నగరంలోని భాగ్యనగర్ నందు 4.50 కోట్లతో నూతనంగా నిర్మించునున్న సబ్ స్టేషన్ కు సోమవారం ఉదయం రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఒంగోలు, ఎస్ ఎన్ పాడు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, బిన్ విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియాలతో కలిసి ప్రారంభోత్సం, శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ…. సబ్ స్టేషన్లు నిర్మాణం వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగం ,చుట్టుపక్కల ప్రాంతాల్లలో వోల్టేజ్ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. నిరంతర త్రీ ఫేస్ విద్యుత్ సరఫరాతో ఒంగోలు నగర పరిధిలో ఇకపై అర్ధాంతరంగా పవర్ ట్రిప్ కావడం, లోవోల్టేజ్ కారణంగా ప్రజలు నష్టపోయే పరిస్థితులు తలెత్తవన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజలకు పింఛన్ పెంపు, తల్లికి వందనం, దీపం పథకం అమలు వంటి సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ ….సబ్ స్టేషన్ పూర్తయితే సమీపంలో ఉన్న ప్రాంతాలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని చెప్పారు. నగరపరిధిలోని గ్రామాలకు నిరవధిక విద్యుత్ సరఫరా లభిస్తుందని, ఇది ప్రజలకు మరియు రైతులకు ఎంతగానో ఉపయోగమని పేర్కొన్నారు. అలాగే కేవలం రైతులకు మాత్రమే కాకుండా, భవిష్యత్తులో పారిశ్రామిక అభివృద్ధికి కీలకమైన మౌలిక సదుపాయంగా మారుతుందని అన్నారు.
కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీవో లక్ష్మి ప్రసన్న , ఎస్ఈ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

