ప్రకాశం జిల్లా దర్శి పట్టణానికి చెందిన మూలే కుమారికి మానవతా స్వచ్చంద సేవా సంస్థ ఆర్థిక చేయూత అందించింది. ఆమె భర్త రఘ రామి రెడ్డి ని కోల్పోయి కుటుంబ పోషణ భారం అయినది. ఆమె హోటల్లో సర్వర్ గా పనిచేస్తూ తన ఇద్దరి పిల్లలను చదివించలేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మానవతా స్వచ్చంద సంస్థ దృష్టికి రావటంతో స్పందించారు. స్వచ్చంద సంస్థ రూ. 5వేలు, దాతల సహాకారంతో మరో 10,516 లు సేకరించి మొత్తం 15,516లను ఆమెకు అందించారు. కార్యక్రమంలో దర్శి సంస్థ చైర్మన్ దేవతి వర ప్రసాద్, వైస్ చైర్మన్ వాకా జనార్థన్ రెడ్డి, జిల్లా డైరెక్టర్ కపురం శ్రీనివాస రెడ్డి కన్వినర్ ధనిరెడ్డి వెంకట రెడ్డి, అధ్యక్షులు చీదేళ్ల బసవయ్య, ప్రధాన కార్యదర్శి గొర్రెపాటి వేణు, కోశాధికారి చింతా తిరుపతి రెడ్డి, ఎ గణేష్, షేక్ ఖాదర్, మస్తాన్, డాక్టర్ పి పెద్ది రాజు, సీహెచ్ రోషా రావు, ఐ సుశీల, ఆర్ రామ కోటి రెడ్డి, ఎల్ వెంకటేశ్వర రెడ్డి, ఎస్ ఎన్ సీహెచ్ సుబ్బా రావు, ఎన్ వెంకట రావు లు పాల్గొన్నారు.
