డా.బి.ఆర్.అంబేద్కర్ స్టడీ సర్కిల్ కేంద్రాల ద్వారా పోటీ పరీక్షల కోసం నిరుద్యోగ ఎస్సీ,ఎస్టీ యువతకు ఉచిత శిక్షణ కార్యక్రమం త్వరలో ప్రారంభిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి ఆది వారం నాడు విడుదల చేసిన ఓ పత్రిక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి ఆ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి కేంద్రాలుగా బ్యాంక్ పి. ఓ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ ఎస్ సి ) రైల్వే రిక్రూట్మెంట్ (ఆర్ ఆర్ బి ( పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తామన్నారు. ఈ శిక్షణ కోసం అభ్యర్థుల నుంచి త్వరలో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ ఎస్సి,ఎస్టీ యువత వినియోగించుకోవాలని మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి సూచించారు.
