ప్రజల నుండి వచ్చే వివిధ రకాల సమస్యల యొక్క ఫిర్యాదులను పరిష్కరించేందుకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక”(మీకోసం) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంకు జిల్లాలో పలు ప్రాంతాల నుండి ప్రజలు నేరుగా వచ్చి తమ ఫిర్యాదుదారులను వ్రాతపూర్వకంగా విన్నవించుకున్నారు. పిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ మరియు పోలీస్ అధికారులు ఫిర్యాదుదారుల అర్జీలను స్వీకరించి, వారితో ముఖాముఖీగా మాట్లాడి వారి ఫిర్యాదుల గురించి సవివరంగా అడిగి తెలుసుకుని ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, సత్వరం పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో వచ్చిన ఆయా ఫిర్యాదులపై జిల్లా ఎస్పీ సంబందిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి వెంటనే చట్ట ప్రకారం విచారణ జరిపి, నిర్దిష్ట కాలపరిమితిలోపల పరిశీలించి, ఫిర్యాదుదారులకు త్వరితగతిన న్యాయం అందించేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని….
ఒంగోలుకు చెందిన బంగారు షాప్ యజమానుడు తన షాపులో పనిచేస్తున్న అమ్మనబ్రోలు గ్రామానికి చెందిన గుమస్తా నమ్మకంగా నమ్మిస్తూ , తను మోసం చేయాలని ఉద్దేశంతో షాపులో ఉన్న బంగారం అమ్ముకొని అవసరాల కోసం వాడుకున్నాడని, లెక్కలు సరిగ్గా చూపక మోసం చేశాడని ఫిర్యాదు.
దర్శి మండలంలోని ఒక సచివాలయం సిబ్బంది తాను సబ్సిడీ కింద వ్యవసాయ పనిముట్లు ఇప్పిస్తానంటూ అద్దంకి మండలానికి చెందిన ఒక రైతు వద్ద నుండి రూ.3,80,000/- డబ్బులు తీసుకోని పనిముట్లు కానీ మరియు డబ్బులు ఇవ్వటం లేదని రైతు ఫిర్యాదు.
తన కుటుంబ అవసరాల నిమిత్తం ఒంగోలుకు చెందిన ఒక మహిళ రూ.1,50,000/-అప్పుగా తీసుకొని తిరిగి చెల్లించేటప్పుడు చెల్లని చెక్కు ఇచ్చి మోసం చేసిందని, అడుగుతుంటే బెదిరిస్తున్నట్లు ఒంగోలు, గోపాలనగరానికి చెందిన ఒక మహిళ ఫిర్యాదు.
ఈ కార్యక్రమంలో మహిళ పోలీస్ స్టేషన్ డిఎస్పీ రమణ కుమార్, ఎస్సీ/ఎస్టీ సెల్ ఇన్స్పెక్టర్ దుర్గ ప్రసాద్, డిటిసి ఇన్స్పెక్టర్ షమీముల్లా, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పాండు రంగారావు, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్ రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

