ఎన్.ఎస్.ఎం.సి.ట్రేడ్ యూనియన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా త్యాగరాజు

జాతీయ సఫాయి మజ్దూర్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా గద్దె త్యాగరాజును నియమిస్తూ జాతీయ ప్రెసిడెంట్ చరణ్ సింగ్ టాక్ మంగళవారం తెలియజేశారు. ఇటీవల మహారాష్ట్ర లోని షోలాపూర్ లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సఫాయి మజ్దూర్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ నూతన రాష్ట్ర కమిటీ నిర్మాణంకొరకు సమావేశం జరిగింది ఈ సమావేశంలో నవ్యాంధ్రలో సఫాయి కార్మికుల కొరకు చేపట్టే కార్యక్రమాలను సమీక్షించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన కమిటీనియామకంచేపట్టటం జరిగింది. ఈకమిటీ నియామకంపైఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కి కూడా సమాచారంను తెలియజేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రెసిడెంట్ గా భూపతి అప్పారావు తో పాటుగా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం, ఉప్పుగుండూరుకుచెందిన గద్దె త్యాగరాజును నియమించడంజరిగింది. రాష్ట్రంలో సఫాయి కార్మికుల హక్కుల కొరకు పోరాడాలని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వారి హక్కులు,సంక్షేమం కొరకు తీసుకునే చర్యలను ఎప్పటికప్పుడు మజ్దూర్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ పర్యవేక్షిస్తూవారికొరకు నిరంతరంగా పాటుపడాలని జాతీయ ప్రెసిడెంట్ చరణ్ సింగ్ టాక్ నూతన కమిటీకి తెలియజేశారు. తనను రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా నియమించిన జాతీయ ప్రెసిడెంట్ చరణ్ సింగ్ టాక్ మరియు రాష్ట్ర ప్రెసిడెంట్ భూపతి అప్పారావు కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు త్యాగ రాజు తెలియ జేశారు. 18 ఏళ్ల పాటు జర్నలిజంలో పనిచేసారు.సామాజిక అంశాలపట్ల పూర్తి అవగాహన కలిగి ఉండటం దీంతోపాటుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ,డాక్టర్ బాబు జగ్జీవన్ రావు ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా మరియు సామాజిక సేవ కార్యకర్తగా పలుప్రజాసంఘాలలో పనిచేసిన అనుభవం త్యాగరాజుకు ఉంది. జాతీయస్థాయిలో వందేళ్లుగా పేరు ప్రఖ్యాతలు ఉన్న ట్రేడ్ యూనియన్ లో తనకు పదవి దక్కటం పట్ల సంతోషంవ్యక్తం చేశారు. అదేవిధంగా సఫాయు మజ్దూర్ కార్మికుల హక్కులతో పాటుగా వారి సంక్షేమం కొరకు రాష్ట్రవ్యాప్తంగా తాను పాటుపడతానని ఈ సందర్భంగా తెలియజేశారు. త్యాగరాజు నియామకం పట్ల జిల్లాలోపలువురు హర్షం వ్యక్తం చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *