తల్లిపాలు బిడ్డకు దివ్య ఔషధమని గైనకాల జిస్ట్ బాదం లక్ష్మి ప్రసన్న అన్నారు. శివరాజ్ నగర్ ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో, మానవతా స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. గైనకాలజిస్ట్ లక్ష్మి ప్రసన్న, చిన్న పిల్లల వైద్యులు డాక్టర్ బి సాయి మణి కుమార్ రెడ్డి లు ముఖ్య అతిథులు గా పాల్గొని ప్రసంగించారు. గర్భవతిగా ఉన్న సమయం నుండి తీసుకోవలసిన ఆహారం, ఆరోగ్యంపై తగిన శ్రర్థ తీసుకోవాలని చిన్న పిల్లల మానసిక పరిస్థితి గురించి వైద్యులు వివరించారు. మానవతా స్వచ్చంద సంస్థ జిల్లా డైరెక్టర్ కపురం శ్రీనివాస రెడ్డి అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. సంస్థ చైర్మన్ దేవి వర ప్రసాద్, అధ్యక్షులు చీదేళ్ల బసవయ్య, సలహాదారుడు ఎస్ ఎన్ సీ హెచ్ సుబ్బారావు, హెచ్పీ సుహాషిని, సుశీలమ్మ, అంగన్వాడీ, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
రాజంపల్లిలో….
ముర్రుపాలు ఎంతో శ్రేయష్కరం ……
ముర్రుపాలు ఎంతో శ్రేయష్కరమని ఐసీడీఎస్ సూపర్ వైజర్ కె అనురాధ అన్నారు.
రాజంపల్లి -2వ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను మంగళవారం నిర్వహించారు. ఈసందర్భంగా సూపర్ వైజర్ మాట్లాడుతూ ఒక గంట లోపు పుట్టిన బిడ్డకు పాలు పట్టించటం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు. తల్లికి బిడ్డకు ఇరువురికి ఎంతో ఉపయోగకరమని వివరించారు. అంగన్వాడీ టీచర్ దామా నరసమ్మ, గర్భవతులు, బాలింతలు పాల్గొన్నారు.

