రాష్ట్రంలో అర్హలైన జర్నలిస్ట్ లందరికి నూతనంగా అక్రిడేషన్లు మంజూరు చెయ్యాలని,ప్రమాద భీమా పాలసీ అమలు చెయ్యాలంటూ పలు జర్నలిస్ట్ ల అపరిస్కృత సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీయూడబ్యుజె తాళ్లూరు మండల శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్ బి వి రమణా రావుకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. అర్హలైన జర్నలిస్ట్ ల అందరిని తన పరధిలో న్యాయం చేస్తానని, మీ డిమాండ్లను జిల్లా కలెక్టర్ కు పంపి విన్నవిస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఏపీయూడబ్యుజే నాయకులు నునుర్ల నరేంధ్ర నాథ్, టి శ్రీనివాస రెడ్డి, వావిలాల శ్రీరామమూర్తి, మారెళ్ల నరసింహా రావు, కొణికి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
