ముప్పై ఐదు కోట్లు ఇప్పించడానికి ఐదు కోట్ల లంచం.ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ ఈ ఎన్ సీ అవినీతి వ్యవహారం..

హైదరాబాద్ ఆగస్ట్ , జే ఎస్ డి ఎం న్యూస్ :
ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు తాను ఇప్పిస్తానని ఐదు కోట్లు కమిషన్ ఇవ్వడానికి ఒప్పుకుంటేనే పని చేసి పెడతానంటూ ఓ కాంట్రాక్ట్ సంస్థ యజమాని తో బేరం సాగించారు.లంచగొండి అధికారి అబ్బవరపు శ్రీనివాస్.తనతో కాకుండా వేరెవరితో పైరవీ చేసినా.. డబ్బులు రాకుండా చేస్తానని సదరు వ్యక్తికి హెచ్చరిక కూడా చేశాడు.ఐదు కోట్లు అంటే మరీ ఎక్కువ అని. అంత ఇచ్చుకోలేమని.. తగ్గించుకోవాలని కాంట్రాక్టర్ సాయి నిర్మాణ సంస్థ అధినేత కృష్ణంరాజు కోరినా సదరు అధికారి ససేమిరా అన్నాడు.
అయితే ఈ నెలాఖరులోనే రిటైర్మెంట్ ఉండటం వల్ల ఆలస్యమైతే మొత్తంగా నష్టపోతానని భావించిన శ్రీనివాస్.రూ.యాబై లక్షల కమిషన్ పై డబ్బులు ఇప్పించేందుకు అంగీకారం చేసుకున్నాడు.ఒక వైపు లంచాధికారితో బేరం సాగిస్తూనే.మరోవైపు
కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చారు.దీంతో
ఒప్పందం ప్రకారం అధికారికి అడ్వాన్స్ కింద మొత్తం రూ.25 లక్షలు ఇచ్చిన కాంట్రాక్టర్.డబ్బులు ఇస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా శ్రీనివాసుని ఏసీబీ అధికారులు. పట్టుకున్నారు.
విజయవాడ గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఈ ఎన్ సీ శ్రీనివాసరావు ను ఏ సి బి అధికారులు అదుపులోకి తీసుకోవడం సంచలనం గా మారింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *