తాళ్లూరు మండలంలో పలు గ్రామాలలో అనారోగ్యంతో బాధపడుతున్న పలువురు వైసీపీ కార్యకర్తలను, మహిళలను వైసీపి జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి పరామర్శించారు. కొర్రపాటి వారి పాలెంలో వైసీపి మాజీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సంఘం ధర్మేంధ్ర ఇటీవల పలు పరీక్షలు చేయించుకోవటంతో మరింత మెరుగైన చికిత్స నిమిత్తం సిఫార్స్ చేసారు. రమణాల వారి పాలెంలో కోటి రెడ్ది తల్లి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకుని ఆమెను పరామర్శించారు. ఆయన వెంట వైసీపి రాష్ట్ర, మండల నాయకులు నర్పంచిల సంఘం అధ్యక్షుడు మారం ఇంద్ర సేనా రెడ్డి, సర్పంచి కోట శివ లక్ష్మి “వెంకట రామి రెడ్డి, ఐవీ సుబ్బా రెడ్డితో పాటు ఆయా గ్రామాల నాయకులు మాజీ ఎంపీపీ గోళ్లపాటి మోషే, సర్పంచి వలి, కోఆప్షన్ మెంబర్ కరిముల్లా, యూత్ అధ్యక్షుడు విష్ణు, మాజీ డీఎంసీ డైరెక్టర్ శరత్ లు పాల్గొన్నారు.

