గంగా భవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు

జిల్లాలో ప్రసిద్ది చెందిన తాళ్లూరు మండలం సోమరప్పాడు పరిధిలోని గుంటి గంగా భవాని
అమ్మవారికి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు. పూజారులు ప్రకాశ రావు, కామేశ్వర శర్మ, బాల రాజు, విజయలక్ష్మి ల ఆధ్వర్యంలో అమ్మవారికి పూజలు నిర్వహించారు. భక్తులు పొంగళ్లు వండి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ కొననా గురు బ్రహ్మం, ఈఓ వాను బాబు, ఆర్ ఏ ప్రసాద్ లు భక్తులకు కావలసిన సౌకర్యాలను పర్యవేక్షించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

కొత్త పాలెంలో పోలేరమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో కొలుపుల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. గ్రామంలో నందడి నెలకొన్నది. నాగంబొట్ల పాలెంలో కొలుపులు నందర్భంగా ప్రతిరోజు పలు కార్యక్రమాలు ఆచారాల ప్రకారం నిర్వహిస్తున్నారు.

దర్శి రిటైర్డు డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డి ప్రత్యేక పూజలు

జిల్లాలో ప్రసిద్ది చెందిన పుణ్యక్షేత్రం గుంటి గంగా భవాని ఆలయంలో దర్శి రిటైర్డు డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో మొక్కబడి ఉండటంతో ఆయన తన కుటుంబంతో వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఈఓ వాను బాబు, ఆర్ఎ ప్రసాద్ లు ఆయనకు స్వాగతం పలికారు.
పూజారులు ప్రకాశ రావు, కామేశ్వర శర్మ, బాల రాజు, విజయలక్ష్మిల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *