మాజీ రాష్ట్ర పతి వివి గిరి జయంతి నిర్వహణ

తాళ్లూరు శాఖ గ్రంధాలయంలో ఆదివారం మాజీ రాష్ట్ర వరాహ గిరి (వివి గిరి) 131వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ముఖ్య అతిధిగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహిత, రిటైర్డ్ హెచ్ఎం ఎన్ అంజి రెడ్డి పాల్గొని వివి గిరి ఆదర్శ ప్రాయుడని, వారి ఆలోచనలు పని విధానం నేటి తరానికి ఆదర్శనీయమని అన్నారు. వారి చరిత్రను వివరించారు. గ్రంధ పాలకురాలు వివిజయకుమారి, .బొద్దికూరపాడు బిడీసీఎల్ నిర్వాహకురాలు – వై పద్మావతి ఆధ్వర్యంలో చదవటం మాకిష్టం కార్యక్రమాన్ని నిర్వహించారు. రిటైర్డు హెచ్ఎం మేడగం అంజి రెడ్డి, ప్రధానోపాధ్యాయులు పోలం రెడ్డి సుబ్బా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *