ఆగస్టు 15 నాటికి జిల్లాలో బంగారు కుటుంబాల దత్తత ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, ఎంపిడిఓలను, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.
సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి ఎంపిడిఓలు, మున్సిపల్ కమిషనర్ లు, డిఎల్డివోలు, డిఎల్పిఓలు, ఈఓఆర్డీలు, ఆర్డబ్ల్యూఎస్, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లు, తదితర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పి 4 కార్యక్రమం పురోగతి, హౌసింగ్ పురోగతి, జి.ఎస్.డబ్ల్యు.ఎస్, ఉపాధి హామీ పధకం పనుల పురోగతి తదితర అంశాలపై సమీక్షించి దిశానిర్దేశం చేసారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఆగస్టు 15 నాటికి జిల్లాలో గుర్తించబడిన బంగారు కుటుంబాల దత్తత ప్రక్రియను పూర్తి చేయాలని అందుకనుగుణంగా ఎంపిడిఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహసిల్దార్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గృహ నిర్మాణాల పురోగతిపై జిల్లా కలెక్టర్ సమీక్షిస్తూ, ప్రభుత్వం మంజూరు చేసిన పక్కా గృహాల నిర్మాణాలలో పురోగతి కనిపించాలని, నిర్దేశించిన లక్ష్యం మేరకు గృహ నిర్మాణాలను పూర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎంపిడిఓలను, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. జి.ఎస్.డబ్ల్యు.ఎస్ అంశాలకు సంబంధించి పెండింగ్ లో వున్న అంశాలను వేగంగా పూర్తి చేయాలని, అలాగే పిల్లల ఆధార సీడింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లా కలెక్టర్ ఉపాధి హామీ పధకం కింద చేపడుతున్న పనుల పురోగతిపై సమీక్షిస్తూ, లేబర్ మొబిలైజేషన్ పైన ప్రత్యేక శ్రద్ధ సారించడంతో పాటు కూలీలకు రోజువారి సగటు వేతనం పెరిగేలా అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫారం పాండ్స్ నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందున నిర్దేశించిన లక్ష్యాల మేరకు ఫారం పాండ్స్ నిర్మాణాలను పూర్తీ చేసేలా మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడిఓ దృష్టి సారించాలన్నారు.
ఈ వీడియో సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొనగా, క్షేత్ర స్థాయి నుండి మునిసిపల్ కమీషనర్లు, డిఎల్.డి.ఓ లు, ఎంపిడిఓ లు, ఈఓ పిఆర్డిలు, ఎపిఓలు , తహసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
