పిజిఆర్ఎస్ లో ప్రజలు అందజేసిన సమస్యల అర్జీలు పెండింగ్ లేకుండా పరిష్కరించేలా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ,
అధికారులను ఆదేశించారు.
సోమవారం ఒంగోలు కలెక్టరేట్ లోని మీ కోసం సమావేశ మందిరంలో నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పిజిఆర్ఎస్) కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వరకుమార్, శ్రీధర్ రెడ్డి, జాన్సన్, కుమార్ లతో కలసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ గోపాల క్రిష్ణ మాట్లాడుతూ… అర్జీల పరిష్కారంలో ఎలాంటి అలసత్వం ఉండరాదని, అలాగే సంబంధిత శాఖలకు వచ్చిన అర్జీలను నిర్ణిత సమయంలో అర్జీలకు పరిష్కారం చూపించాలన్నారు. అర్జీదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు .. క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి, అర్జీదారులు సంతృప్తిచెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ, రీఓపెనింగ్.. లేకుండా నిర్ణీత గడువులోపు అర్జీలకు పరిష్కారం చూపేలా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి అర్జీని సంబంధిత ప్రధాన అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి అర్జీదారులు సంతృప్తిచెందేలా ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


