రాజముద్రతో తయారు చేసిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం పటిష్టంగా చేపట్టేలా చర్యలు – సిసిఎల్ఏ ప్రత్యేక కార్యదర్శి జయలక్ష్మి

ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాజముద్రతో తయారు చేసిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం పటిష్టంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సిసిఎల్ఏ ప్రత్యేక కార్యదర్శి జయలక్ష్మి
జిల్లా కలెక్టర్ల కు సూచించారు.
విజయవాడ సీసీఎల్ఏ కార్యాలయం నుంచి మంగళవారం అన్నదాత సుఖీభవ, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, కాస్ట్ సుమోటో డ్రైవ్, డిసిప్లినరీ కేసులకు సంబంధించి ఎంక్వయిరీ పెండేన్సీ, జాయింట్‌ ఎల్‌పీఎం సమస్యకు పరిష్కారం, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిసిఎల్ఎ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేసారు. ఈ సందర్భంగా సిసిఎల్ఎ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శ్రీమతి జయలక్ష్మి మాట్లాడుతూ.. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాజముద్రతో తయారు చేసిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం పటిష్టంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాల్లో చేపట్టిన రీ సర్వే ప్రక్రియ ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. రెవెన్యూ శాఖలో డిసిప్లినరీ కేసులకు సంబంధించి ఎంక్వయిరీ పెండేన్సీ ని త్వరగా పూర్తీ చేసేలా ప్రత్యేక శ్రద్ద చూపాలన్నారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పధకాలకు సంబంధించి జాయింట్‌ ఎల్‌పీఎం సమస్యలకు పరిష్కారం చేపేలా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఈ వీడియో కాన్ఫెరెన్స్ కు ఒంగోలు జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారి గౌస్ భాషా, కలెక్టరేట్ ల్యాండ్ సెక్షన్ సిబ్బంది తదితరులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *