జాతీయ నులి పురుగుల దినోత్సవం సందర్భంగా మంగళవారం మండలంలోని తాళ్లూరు, తూర్పుగంగవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 9820 మంది విద్యార్థులకు ఆల్ బెండా జోల్ మాత్రల పంపిణీ లక్ష్యంగా వైద్యశాఖ ఆయా అంగన్వాడీలు, పాఠశాలలు, కళాశాలలో ఉపాధ్యాయుల సహకారంతో మాత్రలు పంపిణీ నిర్వహించారు. తాళ్లూరు పీహెచ్సీ పరిధిలో 4317 మంది విద్యాలకు మాత్రల పంపిణీ లక్ష్యంగా వైద్యాధికారి డాక్టర్ పి. ప్రవీణ్, డాక్టర్ సీ రాజేష్ యాదవ్ లు, హెచ్ వి రవి, సిబ్బంది పాల్గొని మాత్రలు పంపిణీ చేసారు. తూర్పుగంగవరం పీహెచ్సీ పరధిలో పిహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ మౌనిక, డాక్టర్ శ్రీకాంత్ లు పాల్గొని ఆయా పాఠశాలలో 5503 విద్యార్థులకు ఆల్ బెండా బెండా జోల్ మాత్రల పంపిణీ లక్ష్యం కాగా 5231 మందికి పంపిణీ చేసారు. గైర్హాజరు అయిన 272 మందికి 20వ తేదిన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి మాత్రలు అందజేస్తామని తెలిపారు. హెచ్ఐఓ చంద్ర శేఖర్, పీహెచ్ఎన్ రవణ, హెచ్ వీ నుశీల, హెచ్ఎ గోపి నాయక్, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.



