హర్ ఘర్ తిరంగ్ కార్యక్రమంలో బాగంగా బుధవారం తాళ్లూరు మండలంలో బిజేపి నాయకులు ప్రభుత్వ కార్యాలయాలకు జాతీయ జెండాలను అందించారు. ప్రతి ఒక్కరూ తమ దేశ భక్తిని మరింత పెంపొందించుకునేందుకు తమ వంతు చేయూతగా పార్టీ ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాలలో జాతీయ జెండాలను అందించినట్లు సీనియర్ బిజేపి నాయకులు మారం గోవింద రెడ్డి తెలిపారు.
