ఘనంగా ప్రకాష్ నగర్ ఎక్స్ టెన్షన్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు…..జాతీయ జెండా ను ఆవిష్కరించిన ప్రెసిడెంట్ షేక్ గౌస్.

బేగంపేట ఆగస్టు 15 జే ఎస్ డి ఎం న్యూస్ :
బేగంపేట ప్రకాశ్ నగర్ ఎక్స్ టెన్షన్ రెసిడెన్షియల్ కాలనీలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్ రెసిడెన్షియల్ కాలనీ ప్రెసిడెంట్ , సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ ఏ బ్లాక్ అధ్యక్షులు షేక్ గౌస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా షేక్ గౌస్ మాట్లాడుతూ స్వాతంత్రం కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను పణంగా పెట్టారని నేటి యువత వారిని స్మరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ వేడుకలలో కాలనీ సభ్యులు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *