జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవతరగతిలో ఉత్తమ మార్కులు సాధించి ప్రతిభచాటిన విద్యార్థులను బూచేపల్లి వెంకాయమ్మ, సుబ్బా రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రొత్సాహక నగదు బహుమతులు 1992వ సంవత్సరం నుండి అందజేస్తున్నారు. అందులో బాగంగా శుక్రవారం ఆ పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ చాటిన ప్రధమ, ద్వితీయ, తృతీయ శ్రేణిలో నిలిచిన పులి మహేష్ కుమార్ రెడ్డికి రూ.5,116, అడకా కోటేశ్వర రావు రూ.3,116, బూచిరాజు కిశోర్ బాబు రూ.2,116లను బివిఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరపున జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైసీపి జిల్లా పార్టీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డిలు అందజేసారు. వారి ప్రతినిధులు ఉప సర్పంచి, మాజీ సొసైటీ అధ్యక్షుడు పులి ప్రసాద్ రెడ్డి, ఎంపీటీసీ బాల కోటయ్య, నర్పంచి మందా శ్యామ్సన్లు అందజేసారు. హెచ్ఎం పి సుబ్బా రావు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, సిబ్బంది పాల్గొన్నారు.
