తాళ్లూరు మండలంలో ఘనంగా పంద్రాగష్టు వేడుకలు

తాళ్లూరు మండలంలో పలు ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో, 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద, తహసీల్దార్ కార్యాలయం ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, తాళ్లూరు నచివాలయం -1 వద్ద నర్పంచి మేకల చార్లేన్ సర్జన్ , పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎన్ఐ మల్లిఖార్జున రావు జెండాలను ఎగుర వేసారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి స్వాతంత్య్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. నేటి లక్ష్యాలను చేరుకోవటానికి ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలని కోరారు. వైన్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, నర్పంచిలు మేకల చార్లేన్ సర్జన్, పోశం శ్రీకాంత్ రెడ్డి, సొసైటీ చైర్మన్లు గొంది రమణా రెడ్డి, వల్లభనేని నుబ్బయ్య, కోఆప్షన్ మెంబర్ కరిముల్లా, మండల టిడిపి పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, క్లస్టర్ ఇన్చార్జి వెంకట రావు, పిన్నిక రమేష్ , నీటి సంఘం ఉపాధ్యక్షుడు తూము శివ నాగి రెడ్డి, గూడ నరస్వతి ప్రభాకర్ రెడ్డి, ఇన్చార్జి ఎంపీడీఓ సానికొమ్ము నత్యం, ఎంఈఓ-1 జి నుబ్బయ్య, ఎంఈఓ -2 నుధాకర్ రావు, ఎపీఓ వెంకట రావు, హౌసింగ్ ఎఈ హనుమంత రావు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తాళ్లూరులో శ్రీ సరస్వతి హైస్కూల్లో విద్యాసంస్థల చైర్మన్ ఎవీ రమణా రెడ్డి, ఎబీసీ హైస్కూల్లో కరస్పాండెంట్ టి శ్రీనివాస రెడ్డి, గీతాంజలి, జాహ్నవి, ప్రగతి, గంగా, శారద, అమెరికల్ పబ్లిక్ పాఠశాలల్లో , వికే జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ వేణుగోపాల్ ,ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జెండాను ఎగుర వేసి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి, సందేశం అందించారు. ఆట పాటల పోటీలు నిర్వహించి విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందించి అభినందిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *