కొండేపి మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణస్వీకారంలో పాల్గొనటానికి శనివారం ఒంగోలు విచ్చేసిన రోడ్లు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డికి టిడిపి నేతలు, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యI, గిద్దలూరు, సంతనూతల పాడు ఎమ్మెల్యేలు ఎం అశోక్ రెడ్డి, బీఎన్ విజయ కుమార్, యర్రగొండ పాలెం టిడిపి ఇన్చార్జి ఎరిక్సిన్ బాబు, ఆంద్ర ప్రదేశ్ మాల వేల్పేర్ కార్పోరేషన్ చైర్మన్ విజయ కమార్ లు పుష్పగుజ్జాలు అందించి, శాలువాలు కప్పి ఘన స్వాగతం పలికారు. అనంతరం తమ పరధిలోని పలు అభివృద్ధి కార్యాక్రమాల గురించి చర్చించారు.

