ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులలో బాధితులకు తక్షణ రిలీఫ్ ఇచ్చి ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు బాధితుల సహనాన్ని పరీక్షిస్తున్నాయని జిల్లా మాల మమౄనాడు అధ్యక్షుడు దార అంజయ్య అన్నారు. తాళ్లూరులో తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలు హత్యకు గురైన ప్రత్యేక పరిస్థితులలో రూ. 10లక్షలు పరిహారం ఇవ్వాలని సీఎం అధ్యక్షతన జరిగిన విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ నిర్ణయం అమలు కావటం లేదని అన్నారు. ఎట్టకేలకు ఎస్సీ, ఎస్టీ రిలీఫ్ ఫండ్ రాష్ట్రంలో రూ.90కోట్లు రావాల్సి ఉండగా రూ. 28.30 కోట్లు విడుదల కావటం చేయటంపై సీఎం చంద్రబాబుకు, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామికి కృతజ్ఞతలు తెలిపారు. కార్పోరేషన్ రుణాలు కూడ మంజూరు చేసి ఆదుకోవాలని దార డిమాండ్ చేసారు.
