సోమవరప్పాడు పోలేరమ్మ గుడి సమీపంలో ఆదివారం ఎదురుగా వస్తున్న రెండు బైక్ లు ఢీ కొన్న సంఘటనలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. వివరాలు.. శివరామపురం గ్రామానికి చెందిన గోనుగుంట చిన సుబ్బా రావు ఉరఫ్ బాబు రావు (74) గత ముప్పై ఏళ్ల క్రితం తూర్పుగంగవరం వచ్చి స్ధిర పడ్డాడు. అయితే శివరామపురం వద్ద ఉన్న ఆయన పొలాన్ని చూసేందుకు ఆదివారం తన బైక్ పైవెళ్లు సమయంలో ఎదురుగా వస్తున్న యువకుల బైక్ ఢీ కొన్నది. దీంతో నేరుగా రాయిపై పడి మృతి చెందాడు. అయితే ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎఎస్సై మోహన రావు తెలిపారు.
