జిల్లా స్థాయి యోగాసనా పోటీలు నిర్వహణ

యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ప్రకాశం డిస్ట్రిక్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా స్థాయి యోగాసనా పోటీలు ఆంధ్ర కేసరి కాలేజీలో లాంచనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పతంజలి యోగ పీఠ్ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ బాలుజీ యోగాచార్య గంధవళ్ల పాల్గొని ఈ పోటీల్లో గెలుపొందిన వాళ్లు రాష్ట్రస్థాయి జాతీయస్థాయి అంతర్జాతీయ స్థాయి ఏషియన్ గేమ్స్ లో కూడా పాల్గొని ఒలంపిక్స్ దాకా వెళ్ళవచ్చని యోగాన్ని స్పోర్ట్స్ లో కలిపారని, మూడు శాతం ఉద్యోగ అవకాశాలు రిజర్వేషన్ కూడా కల్పించినట్లుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందేనని చెప్పారు. ఈ ప్రోగ్రాం లో హెల్త్ ఆఫీసర్ గంగరాజు నాగేశ్వరరావు పతంజలి కార్యదర్శి సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో మొదటి బహుమతి సాధించిన వాళ్లు 21వ తేదీ తాడేపల్లిగూడెంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించి వెళ్తారని , అలాగే సెప్టెంబర్ 25న నేషనల్ స్థాయి పోటీలు విజయవాడలో జరుగుతున్నట్టు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

విజేతలు వీరే….
ఆర్టిస్ట్క్ సోలో మొదటి బహుమతి గంధవళ్ల రాధా రమణి , ఫార్వర్డ్ బెండింగ్ సీనియర్ సి విభాగంలో టెంకాయ శ్రీనివాస్ ,
బ్యాక్ పెండింగ్ లో ఎల్ రోషిని మొదటి బహుమతి ,
హ్యాండ్ బ్యాలెన్స్ రిటమిక్ పెయిర్ లోఎన్ చిన్నమ్మాయి
మొదటి బహుమతి ,
ట్విస్టింగ్ విభాగంలో సిహెచ్ శ్రీధర్ మొదటి బహుమతి,
ట్రెడిషనల్ విభాగంలో ఏ శ్వేతా మొదటి బహుమతి
పొందారు.
కార్యక్రమ నిర్వహాకులు సోమా సుబ్బారావు, బోయపాటి రవి ,ఉపాధ్యక్ష్యులు అడ్వొకేట్ దేవకుమారి ,జాయింట్ సెక్రటరీ కె వి శేషారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *