తాళ్లూరు మండలం లోని
మన్నేపల్లి – లింగాల పాడు మధ్య రోడ్డులో భారీ గుంతలు పడి ద్విచక్ర వాహన దారులు, వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ముండ్లమూరుకు తుర పాలెం, విఠలాపురం మీదుగా వాహన రద్దీ ఎక్కువగా ఉండటం, ప్రయాణికులు సైతం అనేక ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వంలో మరమ్మత్తులు చేసినా సరే భారీ వాహనాలు ఈ దారిలో తిరకగంతో మోకాలు లోతు భారీ గుంతలు పడ్డాయి. మన్నేపల్లి గ్రామస్తుడైన టిడిపి నాయకులు, మన్నేపల్లి సోసైటీ చైర్మన్ గొంది రమణా రెడ్డి (నమర) వాహనదారుల, ప్రజల అవస్థలను గమనించి తన స్వంత నిధులతో రోడ్డులో గుంతలను పూడ్చాలని తరలించాడు. శుక్రవారం డోజర్ వాహనం పిలిపించి ఆయన స్వయంగా దగ్గర ఉండి ఆ దారిలోని 1.5 కి.మీల పరధిలో గుంతలను పూడ్పించారు. నిత్యం రద్దీగా ఉండే దారిలో గుంతలను పూడ్పించిన సొసైటీ చైర్మన్ గొంది రమణారెడ్డి ( నమర)కు పలు గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఆయా గ్రామాలలో నాయకులు కూడ సోసైటీ చైర్మన్ను ఆదర్శంగా తీసుకుని జంగిల్, మట్టి రోడ్ల గుంతలు పూడిస్తే కొంత మేర ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు.

