ఆంధ్రకేసరి జీవితం అదరికి స్పూర్తి దాయకం – జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్

స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం అందరికి స్ఫూర్తి దాయకమే కాక ఆయన ధైర్యం, త్యాగానికి నిలువెత్తు నిదర్శమని జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ అన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు 154వ జయంతిని ఎస్పీ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఎస్పీ, సిబ్బంది ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ …జిల్లాలోని నాగులుప్పల పాడు మండలం వినోద రాయుని పాలెంలో జన్మించి ఆయన జీవితం ప్రతి ఒక్క యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఆయన జీవిత చరిత్రను వివరించారు. 1972 డిశంబర్ 5న ఒంగోలు జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మారారని ఆ మహానీయుడు జీవిత చరిత్ర ప్రతి ఒక్కరూ మననం చేసుకోవాలని కోరారు. ఎఆర్ డీఎస్పీ కె శ్రీనివాస రావు. ఎసిబి ఇన్స్పెక్టర్ రాఘ వేంద్ర . పి సిఆర్ ఇన్స్ఫెక్టర్ దుర్గ ప్రసాద్, ఆర్ఎ లు రమణా రెడ్డి, సీతా రామి రెడ్డి పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *