ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న డాక్టర్ల ఇన్సర్వీస్ పీజీ కోటాను తగ్గింపు తగదు- ఆంధ్ర ప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్స్ అసోషియేషన్- అసోషియేషన్ ఆధ్వర్యంలో జిల్లా వైద్యాధికారి కి వినతి పత్రం అందజేత

రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న డాక్టర్ల ఇన్ సర్వీస్ పీజీ కోటాను 20శాతం నుండి 15శాతానికి తగ్గించటం తగదని ఆంధ్ర ప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అసోషియేషన్ బాధ్యులు పేర్కోన్నారు. సంఘ జిల్లా అధ్యక్షుడు కాలమాల రాహుల్, జనరల్ సెక్రటరీ షేక్ ఖాదర్ మస్తాన్ బి, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సుందర్ ప్రసాద్. అసోషియేషన్ సభ్యులు డాక్టర్ నబి వలి, డాక్టర్ కుమార స్వామి తదితరులు పాల్గొని జిల్లా వైద్యాధికారి డాక్టర్ టి వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ …గతంలో చర్చల సందర్భంలో సర్వీస్ కోటాలో తగ్గించే ఉద్దేశ్యం ఉంటేనే అసోషియేషన్ ప్రతినిథులతో చర్చిస్తామని ఇచ్చిన హామీ ప్రభుత్వం విస్మరించినదని అన్నారు. కేవలం ఏడు శాఖలలో సర్వీస్ కోటా కాకుండా గతంలో మాదిరిగా అన్ని శాఖలలో సర్వీస్ కోటాను అమలు అయ్యేలా చూడాలని కోరారు. గిరిజన పల్లె ప్రాంతాలలో సంవత్సరాలు పనిచేస్తున్న వైద్యుల కేరీర్ పై సర్వీస్ కోటా తగ్గింపు అశని పాతంలా ఉందని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రస్తుతం అమలు చేస్తున్న 20శాతం కోటాను యధా విధిగా అమలు చెయ్యాలని విన్నవించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *