అందరి భాగస్వామ్యంతోనే స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర విజయవంతం -ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు

అందరి భాగస్వామ్యంతోనే స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర విజయవంతం అవుతుందని ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు అన్నారు. మండల కేంద్రంలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. వ్యక్తి గత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు గత డిశంబర్ మాసం నుండి ప్రతి నెలా మూడవ శనివారం ఒక్కొక్క నెల ఒక్కోక్క లక్ష్యంతో కార్యక్రమం నిర్వహిస్తున్న బీసీ సంక్షేమశాఖ ఈ డీ, మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వర రావు తెలిపారు. హ్యాండ్స్ క్లీనింగ్, డ్రై క్లీనింగ్ ప్రధానాంశంగా ఈ వారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి మాట్లాడుతూ మొక్కల పెంపకంతో పర్యావరణ పరిరక్షణ సాధ్యమని అన్నారు. ఎంపీడీఓ సానికొమ్ము నత్యం, ఎపీఓ వెంకట రావు, ఎపీఎం దేవ రాజ్, గ్రామ కార్యదర్శి షేక్ షహనాజ్ బేగం, టిడిపి క్లస్టర్ ఇన్చార్జి రాచకొండ వెంకట రావు, నవులూరి విద్యా సాగర్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తూర్పుగంగవరంలో పంచాయితీ కార్యాలయం ఆవరణలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వర రావు, ఎంపీడీఓ సత్యం, టిడిపి నాయకులు చందన, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *