ఘనంగా ఆంధ్ర కేసరి జయంతి వేడుకలు నిర్వహణ -టంగుటూరి యువతకు ఆదర్శం

పౌరుషం, త్యాగం, ప్రతిభకు ప్రతీకగా నిలిచిన టంగుటూరి ప్రకాశం పంతులు నేటి యువతకు ఆదర్శమని వక్తలు అన్నారు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం ఆంధ్ర కేసరి 154 జయంతిని పురష్కరించుకుని ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్ది, మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వర రావు, టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, మాజీ అధ్యక్షుడు ఓబులు రెడ్డి, నర్పంచి వలి, కోఆప్షన్ మెంబర్ కరిముల్లా, నవులూరి విద్యాసాగర్, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *