మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కి మొదటి మట్టి గణపతి -ప్రతి ఒక్కరు మట్టి గణపతిని ప్రతిష్టించాలి – పిలుపు నిచ్చిన వెంకయ్యనాయుడు.మట్టిగణపతి ప్రచారం పై అభినందనలు తెలిపినమాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.

హైదరాబాద్ ఆగస్టు 23
(జే ఎస్ డి ఎం న్యూస్) : మట్టిగణపతులను ప్రతిష్టించడం చాలా మంచి పరిణామం అని భారత మాజీ ఉప రాష్ట్రపతి ఏం.వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. శనివారం శ్రీ వాసవి యువజన సేవా సంఘం ఆద్వర్యం లో మొదటి మట్టి గణపతిని వాసవి సంఘం ప్రతినిధులు అందజేయుట జరిగింది. ఈ సందర్భంగా గత 15 ఏళ్లగా మట్టి గణపతి ప్రచారం చేయడం, మట్టిగణపతులనే ప్రతిష్టించడం అభినందనీయమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఉత్సవాలు సంప్రదాయబద్దంగా నిర్వహించడం చాలా అవసరం అన్నారు. యూసఫ్ గూడా డివిజన్ శ్రీకృష్ణ నగర్ లో గత 15ఏళ్లగా మట్టి గణపతిని ప్రతిష్టించి, మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుంది. కార్యక్రమం లో యువజన సంఘం ప్రతినిధులు పుట్టా రామకృష్ణ, అట్లూరి రామకృష్ణ, ఎ.సూర్య రావు, ఎస్ శ్రీనివాస్ రావు, పుట్టా ప్రసాద్ బాబు, పుట్టా బుజ్జి, పూర్ణ నాగేశ్వర రావు, నవీన్, సర్వరావు, అనిల్, రకంజిత్, రాంజీ, లక్ష్మి రావు, శ్రవణ్, మణి, సతీష్, నరేష్, ల్ నాచు నవీన్, కేడ్గర్ రామ్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *