బేగంపేట ఆగస్టు 22 (జెఎస్ డి ఎం న్యూస్) :
బేగంపేట డివిజన్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని బేగంపేట కార్పొరేటర్ టి మహేశ్వరీ శ్రీహరి అధికారులు ఆదేశించారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని ప్రకాశం నగర్ లో 30 లక్షల రూపాయలతో చేపట్టిన సిసి రోడ్డు నిర్మాణ పనులను జిహెచ్ఎంసి అధికారులతో కలిసి కార్పొరేటర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్లో చేపట్టిన అభివృద్ధి పనులను వీలైనంత వేగంగా పూర్తి చేయాలన్నారు .అలాగే డ్రైనేజీ లైన్ పొంగిపొర్లకుండ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యుత్ తీగలకు అంతరాయంగా ఉన్న చెట్ల కొమ్మలను వెంటనే కొట్టివేయాలన్నారు. వివిధ బస్తీల్లో వీధిలైట్లు వెలగడం లేదని తన దృష్టికి వచ్చిందని వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. అలాగే వివిధ బస్తీల్లో చెత్త పేరుకుపోయిందని సానికులు తన దృష్టికి తీసుకువచ్చారని ప్రకాశం నగర్ లో పేరుకుపోయిన చెత్తకుప్పలను కూడా తొలగించాలన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు టి. శ్రీహరి ,నరేష్, జాండ్ల కృష్ణ, ఆరిఫ్, బంగారు శీను తదితరులు పాల్గొన్నారు.

