స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి – రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి

స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు.
శనివారం ఒంగోలు కలెక్టరేట్ లో నిర్వహించిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, శాసన మండలి సభ్యులు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, సంతనూతలపాడు శాసన సభ్యులు బి.ఎన్. విజయకుమార్, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, ఎపి మాల వెల్ఫేర్ కార్పోరేషన్ చైర్మన్ డా విజయకుమార్, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ లతో కలిసి మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేసారు. ఈ సందర్భంగా మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ… వ్యక్తి గత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గత డిసెంబర్ మాసం నుండి ప్రతి నెలా మూడవ శనివారం ఒక్కొక్క నెల ఒక్కొక్క థీమ్ తో స్వర్ణ ఆంద్ర – స్వచ్చ ఆంద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 3వ శనివారం కృష్ణాష్టమి పండుగ రావడంతో 4వ శనివారం ఈ రోజు స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుచున్నదన్నారు. హాండ్స్ క్లీనింగ్ మరియు డ్రైన్ క్లీనింగ్ ప్రధానాంశంగా ఈ రోజు స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వలు లేకుండా డ్రైన్స్ క్లీనింగ్ చేయడం, దోమల నివారణకు మందులు స్ప్రే చేయడం, నీటి నాణ్యతలను పరీక్షించడం, హాండ్ వాష్ పై అవగాహన కలిగించడం తదితర కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. గత మాసంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నివారించే అంశంతో కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగిందన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో డ్రాయింగ్ ఆఫీసర్ ను యూనిట్ గా తీసుకొని ఒక నిబద్దతతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సమాజంలో పరిసరాలు పరిశుభ్రతతో ప్రశాంత జీవనం సాగిస్తున్నామంటే పారిశుధ్య కార్మికుల పాత్ర కీలకమన్నారు. పారిశుధ్య కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం జరుగుచున్నదని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఆర్దిఒ లక్ష్మి ప్రసన్న, ఒంగోలు మున్సిపల్ కమీషనర్ వెంకటేశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. వెంకటేశ్వర రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *