సేవచేయడం వల్ల మనిషి యొక్క ఆయుప్రమాణం పెరుగుతుంది — కపురం శ్రీనివాసరెడ్డి.

  మానవత స్వచ్ఛంద సేవాసంస్థ  22 వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

దర్శి మానవత సంస్థ ప్రతినిధులందరూ కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం
పేద కుటుంబీకులైన ఇరువురికి రూ.5 వేల చొప్పున , రూ. 10 వేల రూపాయలు అందజేసారు. మానవత స్వచ్ఛంద సేవాసంస్థకు జిల్లా ప్రధాన కార్యదర్శిగా మరియు సెంట్రల్ కమిటీ కన్వీనర్ గా ఎన్నుకోబడిన కపురం శ్రీనివాసరెడ్డిని దుశ్శాలువాలతో, పూలమాలలతో ఘనంగా సన్మానించారు .ఈ కార్యక్రమానికి చీదెళ్ళ.బసవయ్య అధ్యక్షత వహించగా.., చైర్మన్ దేవతి వరప్రసాదరావు, లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి,పి.పెద్దిరాజు,ఎసెన్సీహెచ్ సుబ్బరావు , రాజకేశవరెడ్డి, వేణు,తిరుపతిరెడ్డి, తదితరులు పాల్గొని మానవత సేవా సంస్థ ప్రాముఖ్యతను సేవా తత్పరతను కొనియాడారు. సన్మాన గ్రహీత,జిల్లా ప్రధాన కార్యదర్శి కపురం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ…, నిస్వార్థంగా సేవజేస్తే మానసికంగా,శారీరకంగా ఉల్లాసంగా ఉండటమేగాకుండా, మనిషియొక్క జీవనవిధానంలో పెనుమార్పులు సంతరించుకోవడమేగాకుండా,అనేక రుగ్మతలకుగూడా దూరమై,ఏకాగ్రత పెరిగి మనిషియొక్క ఆయుస్సు పెరుగుతుందని అన్నారు. ఇప్పటివరకు నాకుతోడుగావుండి ఈ స్థాయికి తీసుకొచ్చిన వారందరికీ ఎల్లవేళలా అండగావుంటానని, అంతేగాకుండా సంస్థ ధీర్ఝకాలిక ప్రయోజనాల దృష్ట్యా, మానవత స్వచ్ఛంద సేవాసంస్థ అభివృధ్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలియజేశారు. కార్యక్రమంలో సుశీలమ్మ,రోషారావు,గణేష్,వెంకట్రావు,నాగరాజు తదితర మానవతామూర్తులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *