విద్యార్థులందరూ వ్యక్తిగత పరిశుభ్రతతోపాటుగా, పరిసరాలనుగూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రకాశం జిల్లా మానవత స్వచ్ఛంద సేవాసంస్థ ప్రధాన కార్యదర్శి కపురం శ్రీనివాస రెడ్డి అన్నారు.
దర్శి లోని డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ సాంఘీక సంక్షేమ గురుకులం లో ‘స్వచ్చాంధ్ర–స్వర్ణాంధ్ర’ కార్యక్రమం అటవీశాఖ సహకారంతో నిర్వహించారు.
ప్రిన్సిపాల్ మీరాసాహెబ్ అధ్యక్షత నిర్వహించిన సభలో ముఖ్య అతిధిగా ప్రకాశం జిల్లా మానవత స్వచ్ఛంద సేవాసంస్థ ప్రధాన కార్యదర్శి మరియు ప్రకాశం జిల్లా ‘ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ(ఐఆర్సీయస్)ఎగ్జికూటివ్ మెంబర్ కపురం శ్రీనివాసరెడ్డి పాల్గొని కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర _స్వర్ణాంధ్ర గురించి విద్యార్థులనుద్దేశించి కపురం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ… మనిషి భూమిమీద మనుగడ సాధించాలంటే, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి విద్యార్థి మొక్కలు నాటడం,వాటిని పరిరక్షించడం ఇప్పటినుండే అలవర్చుకోవాలని అన్నారు. చెట్టే అన్నింటికీ మూలాధారమని విద్యార్థులకు తెలియజేశారు.

