ప్రతి విద్యార్ధి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్య సాధనకు కృషి చేసి సమాజంలో ఆదర్శంగా నిలవాలి – జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా

ప్రతి విద్యార్ధి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్య సాధనకు కృషి చేసి సమాజంలో ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా విద్యార్ధులకు సూచించారు. సోమవారం ఉదయం ఒంగోలులోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహం-2, 3 కు సంబంధించి విద్యార్ధులను జేడి శీలం పరివర్తన భవనంలోకి షిఫ్ట్ చేసే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ప్రారభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ఒంగోలులోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహం – 2,3 కు సంబంధించి 5 కోట్ల 12 లక్షల రూపాయల డిఎంఎఫ్ నిధులతో అదనపు గదుల నిర్మాణం చేపడుతున్న నేపధ్యంలో విద్యార్ధులకు అసౌకర్యం కలగకుండా విద్యార్ధులను ఈ రోజు జేడి శీలం పరివర్తన భవనంలోకి షిఫ్ట్ చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పేద విద్యార్ధుల భవిష్యత్ ను దృష్టిలో వుంచుకొని సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో 38 వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా మరమత్తు పనులు చేపట్టుటకు 13 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. అలాగే డిఎంఎఫ్ నిధుల నుండి కూడా 19 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. సంబంధిత మరమత్తు పనులు ముమ్మరంగా జరుగుచున్నవన్నారు. జిల్లా లో బాల్య వివాహాలను నివారించడానికి పేద విద్యార్ధులు చదువుపై శ్రద్ద పెట్టేలా సంక్షేమ వసతి గృహాలలో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి విద్యార్ధి పాజిటివ్ దృక్పథంతో మానసిక స్థైర్యంతో ముందుకు పోయినప్పుడే నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. చదువుతో పాటు ఇతర వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకొని ఇతరులకు ఆదర్శకులుగా ఉన్నతి శిఖరాలకు చేరుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, విద్యార్ధులకు సూచించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

సాంఘిక సంక్షేమ శాఖ డిడి లక్ష్మా నాయక్ మాట్లాడుతూ…. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామాత్యులు జిల్లా వాసులైనందున, వారు, జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలపై ప్రత్యేక దృష్టి సారించి వసతి గృహాల్లో మరమత్తు పనులకు రూ.19 కోట్ల 62 లక్షల రూపాయల డిఎంఎఫ్ నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. ఇందులో ఒంగోలులోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహం -1 కు 6.15 కోట్ల రూపాయలు, ఒంగోలులోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహం -2,3 లకు 5.12 కోట్ల రూపాయలు, ఎస్ఎస్ పాడు సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహానికి 2 కోట్ల రూపాయలు, చీమకుర్తి లోని బాలికల సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహానికి 2 కోట్ల రూపాయలు, ఒంగోలు లోని సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహానికి 3 కోట్ల రూపాయలు, పివి ఆర్ హై స్కూల్ లోని అదనపు గదుల నిర్మాణానికి రూ. 75 లక్షల రూపాయలు, పరివర్తన భవన్ మరమత్తు పనులకు రూ.60 లక్షల రూపాయలతో పనులు చేపడుతున్నట్లు వివరించారు.

ఒంగోలు మున్సిపల్ కమీషనర్ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ… సంక్షేమ వసతి గృహాలలో విద్యను అభ్యసించేవారు పేద, మధ్యతరగతి నుండి వచ్చిన వారేనని, విద్య ఒక్కటే అభివృద్ధి కి సోపానం అని అన్నారు. చదువు ద్వారా మాత్రమే మనం మంచి పొజిషన్ కు వెల్లగలమన్నారు. పేదరికం గాని, ఇంట్లో సమస్యలను గాని అన్నింటికీ పరిష్కారం చదువు ఒక్కటేనని, ప్రతి విద్యార్ధి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బంది, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *