పొగాకు కొనుగోళ్లలో సమతుల్యం పాటించాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. జిల్లాలో పొగాకు కొనుగోళ్లపై బోర్డు రీజనల్ మేనేజర్ ఎస్.రామారావు, ఐటిసి మార్కెటింగ్ మేనేజర్ రాజుదొరై లతో సోమవారం తన కార్యాలయంలో ప్రత్యేకంగా చర్చించారు. కొనుగోళ్లకు సంబంధించి పొగాకు కంపెనీలు ఇచ్చిన ముందస్తు రిక్వైర్మెంట్స్, జిల్లాలో పొగాకు ఉత్పత్తి, ఇప్పటివరకు కొనుగోలు, బ్యాలెన్స్ వివరాలపై కలెక్టర్ ఆరా తీశారు. లో గ్రేడు పొగాకును ఎక్కువగా తిరస్కరిస్తున్నట్లు ( నో బిడ్ ) వార్తలు వస్తున్నాయని, అన్ని రకాల ఉత్పత్తులను కంపెనీలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ దిశగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని ఐటిసి మార్కెటింగ్ మేనేజరుకు చెప్పారు.
పొగాకు కొనుగోళ్లలో సమతుల్యం పాటించాలి – జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా
25
Aug